Chandrababus House Arrest Petition Verdict: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబునాయుడికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు సాగాయి. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. సెంట్రల్‌ జైలులో చంద్రబాబు భద్రత కోసం తీసుకున్న చర్యలకు సంబంధించి అడ్వకేట్ జనరల్‌కు లేఖ రాశారు హోం సెక్రటరీ.. ఆ లేఖను కోర్టుకు సమర్పించారు ఏజీ శ్రీరాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా.. పూర్తి భద్రత నడుమన ఉన్నారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి  కోర్టుకు తెలిపారు. ఇంట్లో ఉండటం కంటే సెంట్రల్ జైలులో ఉండటం చంద్రబాబుకు సేఫ్‌ అన్న ఆయన.. సుప్రీం కోర్టు ఇచ్చిన కేసు తీర్పును చంద్రబాబు కేసుకు ముడి పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. వీఐపీ ముద్దాయికి కల్పించే అన్ని వసతులు జైల్లో కల్పించాం. 


చంద్రబాబుకు జైల్లో పూర్తిగా సెక్యూరిటీ కల్పించాం.. జైలులో మాత్రమే కాదు.. జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు సెక్యూరిటీ ఉంది.. 24 గంటలు పోలీసులు డ్యూటీలో ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం అయుతే వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 


Also Read: Minister Roja: దత్తపుత్రుడు నోరు అదుపులో పెట్టుకో.. చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు: మంత్రి రోజా  


అంతేకాకుండా ఆర్థిక నేరాల్లో సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని.. అందుకే చంద్రబాబుకు హౌస్‌ అరెస్ట్‌కు అనుమతించవద్దని న్యాయస్థానాన్ని కోరారు. చంద్రబాబు హౌజ్‌ అరెస్టు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ఇరు వర్గాల వాదనలు ముగిశాయి. 


తాజాగా అందిన సమాచారం ప్రకారం చంద్రబాబు హౌస్ అరెస్ట్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌, పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, చంద్రబాబు తరపున సిద్ధార్థ లుథ్రా వాదనలు విన్న కోర్టు.. తీర్పును రేపటికి వాయిదా వేసింది. మంగళవారం వెలువడబోయే తీర్పు కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు రాబోయే తీర్పుతో చంద్రబాబుకి ఊరట కలుగుతుందా..? లేదా అనే అంశంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Also Read: Chandrababu Case: చంద్రబాబు కేసులో కీలక పరిణామాలు, అటు కస్టడీ, ఇటు బెయిల్‌పై ఉత్కంఠ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook